సీఎం జగన్ సన్నిహితుల చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్లనుందా…? ఆయన ఆర్థిక మిత్రులకు దక్కేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా…? కోట్ల విలువైన భూములే అసలు విషయమా…?
ఈ ప్రశ్నలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ అవుననే అంటున్నారు. తన ఆర్థిక సన్నిహితులకు ఉక్కు ఫాక్టరీ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన విమర్శించారు. వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు బీజేపీ-వైసీపీ కుమ్మక్కయాని ఆయన విమర్శించారు.
విశాఖ ఉక్కు ఫాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో ప్రతిఘటిస్తామని శైలజానాథ్ హెచ్చరించారు. ఈ అంశంపై అధికార పార్టీ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కావాలనే ఉక్కు ఫాక్టరీని నష్టాల్లో చూపిస్తున్నారని, ఎందుకు కొత్త మైన్స్ ఇవ్వటం లేదని ప్రశ్నించారు. సుజనా చౌదరి ఉక్కు ఫాక్టరీ జోలికి రావద్దంటూ సూచించారు.