విశాఖ ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం అవుతుంది. ఇప్పటికే కార్మికులు, ప్రజా సంఘాలు, పార్టీలు ఆందోళన చేస్తుండగా, ఈ నెల 25 నుండి కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. యాజమన్యానికి నోటీసు కూడా ఇచ్చారు.
అయితే, ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ కలకలంరేపుతోంది. తాను శనివారం సాయంత్రం 5.49 నిమిషాలకు అగ్నికి ఆహుతి కావాలని నిర్ణయించుకున్నానని రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఉద్యమంలో విజయం సాధిస్తామని, తన ప్రాణత్యాగం నుండే ఈ పోరాటం మొదలుకావాలని శ్రీనివాసరావు నోట్ లో పేర్కొన్నారు.
ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా స్టార్ట్ అవ్వాలని, 32మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ ఉక్కు కర్మాగారం… ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వొద్దంటూ కోరారు. సూసైడ్ లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించకుండాపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.