నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించిందని… విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా, మరొకటయినా వెనక్కి తగ్గేది లేదని కేంద్రం వాదిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ… ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రం ఏమాత్రం వెనక్కితగ్గలేదు సరికదా, ప్రైవేటీకరణ తప్పదంటూ మరింత ఆజ్యం పోస్తున్నారు.
కానీ ఇవన్నీ అప్పుల్లో ఉన్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మార్చి నెలలో స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ఓవైపు ఉద్యమం చేస్తూనే కార్మికులంతా కంపెనీని లాభాల బాట పట్టించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు 18 వేల కోట్ల టర్నోవర్ సాధించింది.
గత నాలుగు నెలల్లో కంపెనీ ఏకంగా 740 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే ఒక్క ఏడాదే అందులోనూ లాక్ డౌన్ సమయంలోనూ కంపెనీ ఏకంగా 13శాతం వృద్ది సాధించింది.
కంపెనీకి ప్రత్యేకంగా గనులు కేటాయించకపోయినా లాభాల బాట పట్టిందని… ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గనులు కూడా కేటాయిస్తే ప్రైవేటు కంపెనీలకు సాధ్యంకాని లాభాలు తెచ్చిపెడుతుందని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇకనైనా కేంద్రం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నాయి.