విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొద్దాం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. రైతులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.