సినీ నటి వి.జె. చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని నజరత్ పేటలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో చిత్ర ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫైనల్ నివేదికను వెల్లడించారు. చిత్ర పుందమల్లి కి చెందిన హేమనాథ్ అనే యువకుడిని ప్రేమించింది. వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయినా పెద్దలకు చెప్పకుండా అక్టోబర్ 19న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తరువాత డిసెంబరు మొదటి వారంలో ఓ స్టార్ హోటల్లో దిగారు. ఆ హోటల్ నుంచే చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొనేది.
కానీ డిసెంబర్ 9న ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్ర ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడనే ఆరోపణలపై హేమనాథ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు నివేదికలో వెల్లడించారు.