ఒకప్పుడు బిగ్ బాస్ లో బానే సంపాదించాడు కదా..?! మరిప్పుడు ఇదేం పోయేకాలం..?! విషయానికొస్తా ఉండండి..!రీలో రియలో తెలీదు గానీ..”కళ్యాణ వైభోగం” సీరియల్ ఫేమ్ హీరో, బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ దొంగతనానికి పాల్పడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఆ క్లిప్ లో సన్నీ డబ్బుకట్టలున్న ఒకబ్యాగ్ ని తీసుకుని పరుగెత్తుకుంటూ బైటకు వచ్చాడు. కారు దగ్గరకు రాగానే బ్యాగ్ కిందపడి ..బ్యాగ్ లో ఉన్న డబ్బు బైటపడింది. ఆ డబ్బులను గబగబా బ్యాగ్ లో కుక్కేసి కారెక్కి పోయాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యిం.
ఇది సినిమా ప్రమోషన్ కోసమని కొందరంటే..నిజమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం సప్తగిరి, సన్నీ హీరోలుగా నటించిన చిత్రం “అన్ స్టాపబుల్”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
సినిమా కథ ప్రకారం ఇదేదో ప్రాంక్ అని ప్రమోషన్ కోసం ప్రేక్షకుల ఎమోషన్ తో ఆడుకుంటున్నారని మెజారి ప్రేక్షకుల ఊహాగానం.మరి సన్నీ ఏస్టేషన్లో ఉన్నాడో..పోలీసులు ఏమంటున్నారో..అసలు ఇది దొంగతనమో… దొంగ’వేషమో’.! క్లారిటీ రావాల్సి ఉంది