ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. రోజుకు లక్షల కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ అన్నారు. యూరప్ లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉందని అలాంటి పరిస్థితి మనకు నెలకొంటే చాలా నష్టాన్ని చూడాల్సి వస్తోందని అన్నారు. పరిస్థితి యూకే మాదిరిగా ఉంటే రోజుకు 14లక్షల కేసులు, ఫ్రాన్స్‌లా ఉంటే 13లక్షల కేసులు నమోదవుతాయన్నారు. యూరప్ 80 శాతం టీకాల పంపిణీ జరిగినా.. డెల్టా ఉద్ధృతి తగ్గడం లేదని అన్నారు.
భారత్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా.. విదేశాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న తీరును చూసి అప్రమత్తంగా ఉంటాలని పాల్ హెచ్చిరించారు. మాస్క్ ల వాడకం తప్పని సరి చేసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప.. ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని పాల్ తెలిపారు.