కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రష్యా షాక్ ఇచ్చింది. రష్యాలో ప్రవేశించకుండా ట్రూడోపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ నిషేధం విధించారు. ఆయనతో మరో 300 మందిని రష్యా బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై యూఎస్, కెనడాలు ఆంక్షలు విధించాయి. ఈ కమ్రంలో ఆయా దేశాల ఆంక్షలకు ప్రతీకారంగా రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది.
బ్లాక్ లిస్టులో… కెనడా విదేశాంగ మంత్రి మెలనే జోలీ, రక్షణ శాఖ మంత్రి అనితా ఆనంద్, దాదాపు అందరూ కెనడా మంత్రులు, కెనడా రక్షణ సిబ్బంది శాఖ చీఫ్, ఇతరులు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఆంక్షలు విధించేందుకు ఒక తీర్మానాన్ని రష్యా ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం బైడెన్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోనీ బ్లింకన్, యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ పై నిషేధం విధించింది.