అట్లాంటిక్ సముద్రంలో స్పెయిన్‌కు చెందిన లాపాల్మా ఐలాండ్‌లో అగ్ని పర్వతం బద్ధలైంది. రెండు రోజులుగా భారీ లావా ప్రవాహం అక్కడి నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది. కొండలు, అడవులని చుట్టేస్తూ అట్లాంటిక్ సముద్రం వైపు లావా వెళ్తోంది. ఒక్కో ఇంటిని చుట్టేస్తూ అగ్ని కణికలు సృష్టిస్తున్న బీభత్సపు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఓ ఇంటిపై ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో లావాపడి.. ఆ నీరు సెగలు కక్కుతున్న వీడియో షేర్ల మీద షేర్లు అవుతోంది.
లాపాల్మాలో 10 రోజులుగా వేలాదిసార్లు భూమి కంపిచింది. ఫలితంగా తీవ్రమైన ఒత్తిడి గురైన అగ్ని పర్వతం భారీ లావాను ఎగజిమ్ముతూ బద్దలైపోయింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే దాదాపు 100 ఇళ్లను లావాను చుట్టుముట్టింది. దాదాపుగా 5 వేల మందిని అక్కడి నుంచి అధికారులు ఇప్పటికే తరలించారు. ఇప్పట్లో లావా ప్రవాహం ఆగే అవకాశం లేదని, అయితే సముద్రంలో కలిస్తే.. విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Advertisements