ఓటుకు నోటు కేసుపై ఏసీబీ కోర్టులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలువురు సాక్షుల వాoగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ టీచర్ల వాoగ్మూలాను నమోదు చేసింది ఏసీబీ కోర్టు. ఇప్పటికే గురువారం వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్, రేవంత్ రెడ్డి అప్పటి పీఏ సైదయ్యల వాంగ్మూలాలను కూడా తీసుకుంది. తదుపరి విచారణను వచ్చే నెల 6 కు వాయిదావేస్తూ.. సాక్షుల విచారణకు తుది విడత షెడ్యూలు ఖరారు చేసింది.