ఓటర్ ఐడీ కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం నుంచి ఓటర్ ఐడీ కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆధార్ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న మాదిరిగానే…ఓటర్ ఐడీలను కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్నెట్ నుంచి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ సిద్దమవుతోంది.
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికల కోసమే ఓటర్ ఐడీల డిజిటలైజేషన్ చేపడుతున్నట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. 2022లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపే సన్నాహాల్లో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందు ఓటర్ లిస్ట్ తయారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు కాబట్టి.. అందుకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు.