ఉత్తరప్రదేశ్ లో నాల్గవ విడత పోలింగ్ జరుగుతోంది. 59 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నాటికి 22.62 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా ఫిలిబిత్ నియోజకవర్గంలో 27.43 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత స్థానంలో 22.49శాతంతో ఫతేపూర్ ఉన్నట్టు వెల్లడించింది.
అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన నియోజక వర్గంగా హర్దోయ్ (22.27 శాతం) నిలిచింది. 624 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు మార్చి 7 న ముగియనున్నాయి. ఇప్పటి వరకు మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాల్గవ విడత పోలింగ్ నేడు నడుస్తోంది.