మూడు రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని 55 , ఉత్తరాఖండ్ లోని 70, గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
యూపీలో మంచు పడుతుండటం, చలి వాతావరణం ఉండటంతో మొదటి రెండు గంటలు పోలింగ్ మందకొడిగా సాగినట్టు ఎన్నికల అదనపు కార్యదర్శి బ్రహ్మదేవ్ తెలిపారు. ఆ తర్వాత నెమ్మదిగా ఓట్ల శాతం పెరుగుతూ వచ్చిందని చెప్పారు. సాయంత్రం వరకు ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు యూపీలో 39.07 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ లో 35.21, గోవాలో 44.63 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే యూపీలో శహరాన్ పూర్ 42.44శాతం, బిజనూర్ 38.64, మురాదాబాద్ 42.28 శాతం, సంభాల్ 38.01 శాతం, రాంపూర్ 40.10 శాతం, అమ్రోహా 40.90 శాతం, బుధావాన్ 35.57 శాతం, బరేలీ 39.41 శాతం, షాజహానపూర్ 35.47 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
గోవాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.63శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని చెప్పారు.
నియోజకవర్గాల పరంగా చూస్తే సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేస్తున్న సాంక్వేలిమ్ లో అత్యధికంగా 54శాతం ఓటింగ్ శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. తర్వాత స్థానంలో సాంగ్వెమ్ 53.91 శాతం, ప్రియోల్ 51.55 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల పరంగా చూస్తే క్యూపెంలో అత్యధికంగా 50.94, వాలపాయ్ లో అత్యల్పంగా 39 శాతం నమోదయ్యాయి.
ఉత్తరఖండ్ లో 35.21 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే అల్మోరా 30.37, ఉత్తరకాశీ- 40.12, ఉదమ్ సింగ్ నగర్ 37.17 శాతం. చమోలీ 33.82, చంపావత్ 34.66, తెహ్రీ గర్వాల్ 32.59, డెహ్రూడూన్ 34.45 శాతం, నైనీటాల్ 37.41, పితోర్ ఘర్ 29.68, పూరీగర్వాల్ – 31.59, భాగేశ్వర్ – 32.55 , రుద్రప్రయాగ్ 34.82%, హరిద్వార్ 38.83 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.