కరోనా వైరస్ దాటికి ఇప్పటికే పలు మందిరాలు తాత్కాలికంగా మూసివేయగా… కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరిగే మథురలోని ఇస్కాన్ టెంపుల్ ను కూడా ఈ సంవత్సరం కరోనా కారణంగా మూసివేశారు. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ లో మొదట ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ కావటం, ఆ తర్వాత అక్కడ ఉండే దాదాపు 330మందికి పరీక్షలు చేయగా 22మందికి వైరస్ నిర్ధారణ కావటంతో ఇస్కాన్ టెంపుల్ ను తాత్కాలికంగా మూసివేశారు.
పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఇస్కాన్ టెంపుల్ ప్రధాన అర్చకులు అంత్యక్రియలకు హాజరైన 10మందిలో ఇద్దరికి కరోనా సోకగా… అది క్రమంగా 22మందికి వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ముగ్గురు అర్చకులు, నలుగురు బ్రహ్మచారీలు, ఇద్దరు సంక్రీత్యన్ సబ్యులు కూడా ఉన్నారు. అందర్నీ హోం ఐసోలేషన్ లో ఉంచి వైద్య సహాయం అందిస్తున్నారు.
దీంతో ఈసారి జన్మాష్టమి వేడుకలను ఆన్ లైన్ లోనే భక్తులకు లైవ్ చూపిస్తున్నారు.