మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రారంభోత్సవం చాన్నాళ్ల కిందటే జరిగింది. ఇన్నాళ్లూ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యాడు వరుణ్, ఇప్పుడీ మూవీ సెట్స్ పైకి వచ్చింది. #VT12 సినిమా షూటింగ్ లండన్ లో మొదలైంది.
సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ లండన్ లోనే ఉంటుంది. జెన్ నెక్స్ట్ కథతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించనున్నాడు ప్రవీణ్ సత్తారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో వరుణ్ తేజ్ గన్స్ పట్టుకుంటూ వాటితో రిహార్సల్స్ చేస్తూ కనిపించాడు.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ద్వారా ఓ బ్యూటిఫుల్ మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రవీణ్ సత్తారు ప్రకటించాడు. ఆ సందేశం ఏదో ఒక ప్రాంతానికి కాకుండా, మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదిగా ఉంటుందని అంటున్నాడు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాఫర్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా గని సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు వరుణ్ తేజ్. దీంతో ప్రవీణ్ సత్తారు సినిమాపై చాలా శ్రద్ధ పెట్టాడు. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.