చెత్త రాతలతో సోషల్ మీడియాలో కొందరు రోత పుట్టిస్తున్నారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనకు , రాజధాని తరలింపుకు లింక్ చేస్తూ, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
విశాఖను రాజధానిగా మార్చకుండా ఉండడానికి పచ్చ పార్టీ చేస్తున్న కుట్రలు అంటూ వైసీపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.ఇది రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి కారణమవుతోంది.మొన్నటికి మొన్న కరోనా వైరస్ ను టీడీపీ నాయకులే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారని ప్రచారం చేశారు.
మరీ ఇంత చెత్త ఆరోపణలు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెట్టేవాళ్ళకు గట్టి కౌం టర్లే ఇస్తున్నారు.