శీనయ్యగా అలరించేందుకు అట్టహసంగా షూటింగ్ మొదలుపెట్టి, అసలు పూర్తవుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నుండి మళ్లీ రేసులోకి వచ్చాడు స్టార్ డైరెక్టర్. డైరెక్టర్ వీ వీ వినాయక్ హీరోగా శీనయ్య టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభమైంది. దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నారు. అయితే… సినిమా కొంత భాగం షూట్ పూర్తయ్యాక మూవీ ఆగిపోయిందని, స్క్రీన్‌పై తను అంతగా ఆకట్టుకోలేనంటూ వినాయక్ తప్పుకున్నారని, వినాయక్ చేవేళ్లలో తన స్టూడియో పనుల్లో నిమగ్నం అయ్యారని వార్తలొచ్చాయి.
అయితే… ఆ సినిమా ఆగిపోలేదట. స్క్రిప్ట్ వర్క్స్‌లో మార్పులు చేర్పులు చేశారని, తన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ను కూర్చొబెట్టి దగ్గరుండి మరీ ఇష్యూ సార్ట్ అవుట్ చేశారట దిల్ రాజు. దీంతో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుకాబోతుందట. ఈ నెల 28 నుండి ఇక శరవేగంగా సినిమా చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.