పలు అవసరాల నిమిత్తం… వివిధ పనుల కోసం ఉదయానే నిద్ర లేవాలని అనుకుంటాం. కానీ ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మాత్రం సక్సెస్ అవుతాం మిగతా అన్ని సమయంలో బద్దకమే విన్ అవుతోంది మనపై. సరైన సమయానికి నిద్ర లేవాలని అనుకుంటాం కానీ బద్ధకం మంచం దిగనివ్వదు. ఇక ఎగ్జామ్ సమయంలోనో, డ్యూటీకి వెళ్లాల్సిన సమయంలోనో అలారం పెట్టుకొని పడుకుంటాం. తీరా అలారం మోగే సమయానికి ఫోన్ స్విచాఫ్ చేసో.. లేక అలారంనే ఆఫ్ చేసో నిద్రలోకి జారుకుంటాం. మళ్ళీ మెల్లగా నిద్రలేచాక అయ్యో ఆ సమయానికి నిద్ర లేచి ఉంటే ఆ పని పూర్తయ్యేదని మనపై మనకే అసహ్యమేస్తోంది. ఇక అలారం పెట్టుకొని సరైన సమయానికి నిద్ర లేవాలంటే ఓ కిటుకును కనిపెట్టేశారు ఆస్ట్రేలియా ఆర్‌ఎంఐటీ వర్సిటీ పరిశోధకులు.
పెద్దగా చేయాల్సిన పనియేమి లేదు… సెట్ చేసి పెట్టుకున్న అలారం టోన్ ను మార్చేయమని చెబుతున్నారు. వినేందుకు వినసొంపుగా ఉండే మంచి టోన్ ను సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మెలోడియస్ అలారం టోన్‌లు విని నిద్ర మేల్కోవచ్చని అంటున్నారు.