దేశంలోని అన్ని వర్గాలకు సాధికారత కలిగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అణగారిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. భగవాన్ శ్రీ దేవ నారయణుని 1111వ అవతార దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో గతంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భారత్ అంటే కేవలం భూభాగం మాత్రమే కాదన్నారు. మన నాగరికత, సంస్కృతి, సామరస్యం, సంభావ్యత వ్యక్తీకరణ అని పేర్కొన్నారు.
వేల సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో సామాజిక శక్తి పెద్ద పాత్ర పోషించిందని ప్రధాని మోడీ అన్నారు. మనమందరం మన వారసత్వాన్ని చూసి గర్విద్దామన్నారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని, దేశం పట్ల మన కర్తవ్యాలను గుర్తుంచుకుందామని పిలుపునిచ్చారు.