సక్సెస్ ఫుల్ గా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది వాల్తేరు వీరయ్య సినిమా. బాబి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ సూపర్ హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 96 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.
అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. వారం తిరిగేసరికి ఏకంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి విజేతగా నిలిచింది వాల్తేరు వీరయ్య సినిమా.
మొదటి రోజు 23 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన వాల్తేరు వీరయ్య సినిమా, రెండో రోజు 12 కోట్లు, మూడో రోజు 12 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. అలా తన హోల్డ్ నిలబెట్టుకున్న ఈ సినిమా, సంక్రాంతి సీజన్ తర్వాత కూడా ప్రతి రోజూ 5 కోట్ల షేర్ తో కొనసాగుతోంది.
అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 79 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. ఏరియా వైజ్ ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 25.92 కోట్లు
సీడెడ్ – 14.61
ఉత్తరాంధ్ర – 11.34
ఈస్ట్ – 8.25
వెస్ట్ – 4.61
గుంటూరు – 6.20
కృష్ణా 5.92
నెల్లూరు – 3.01