తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. ఉదయం 4 గంటలకు మొదటి ఆట విడుదల అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 12 వందలకు పైగా థియేటర్లలో వీరయ్య హవా షూరూ అయ్యింది. దీంతో మెగా అభిమానులు సినిమా టాకీస్ ల వద్ద హంగామా చేస్తున్నారు.
ఇందులో చిరు సరసన శృతి హాసన్ హీరోయినగా నటించగా, కీలక పాత్రలో రవితేజ నటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి పలువురు సినీ ప్రముఖులు మూవీని చూశారు. దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు, డైరెక్టర్ మెహర్ రమేష్ తదితరులు మొదటిషోను చూశారు.
నాలుగు గంటలకే సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్న వీరు అభిమానులతో కలిసి సినిమాను చూశారు. థియేటర్ వద్ద మెగా అభిమానులు హంగామా చేశారు. బాణసంచా కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.