లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి హిట్ కొట్టారు. ఓవర్సీస్ లో తిరుగులేని విజయాన్నందుకున్నారు. ఆయన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య, ఓవర్సీస్ లో దుమ్ముదులుపోతోంది. తాజాగా ఈ సినిమా 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో సంక్రాంతి విజేతగా నిలిచారు చిరంజీవి.
తాజా వసూళ్లతో వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయింది. సంక్రాంతి సీజన్ అక్కడింకా కొనసాగుతోంది. మరో రోజు టైమ్ ఉంది. కాబట్టి ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఖాయమని తేలిపోయింది. ఇకపై బయ్యర్లకు వచ్చే ప్రతి డాలర్ లాభం కిందే లెక్క.
బాబి దర్శకత్వంలో తెరకెక్కింది వాల్తేరు వీరయ్య సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది.
మరోవైపు వీరసింహారెడ్డి సినిమా ఆడుతున్నప్పటికీ, అన్ని సెంటర్లలో వాల్తేరు వీరయ్య డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో కూడా వీరసింహారెడ్డి మిలియన్ డాలర్ మార్క్ మాత్రమే టచ్ చేసింది. ఇకపై దాని రన్ కష్టమే అంటోంది ట్రేడ్. అలా సంక్రాంతి బరిలో ఓవర్సీస్ లో వీరయ్యదే పైచేయిగా నిలిచింది.