నటీనటులు: చిరంజీవి, రవితేజ, ప్రకాష్ రాజ్, శ్రుతి హాసన్, కేతరిన్, బాబి సింహా, రాజేంద్ర ప్రసాద్
నిర్మాత : నవీన్ ఎర్నేని, వై రవి శంకర్
దర్శకత్వం: కేఎస్ రవీంద్ర
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
మాటలు : కేఎస్ రవీంద్ర, చక్రవర్తి రెడ్డి
సినిమాటోగ్రాఫర్: ఆర్థర్ ఎ విల్సన్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వీళ్లిద్దరూ కలిసి నటించడంతో ఫ్యాన్స్ కి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ట్రైలర్ కూడా ఆ అంచనాలను ఇంకాస్త పెంచేసింది. అయితే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. చిరు కెరీర్ లో మళ్లీ టర్నింగ్ పాయింట్ సెట్ చేసిందా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథ: విశాఖ పట్నంలోని జాలర్ల పేటలో ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు వాల్తేరు వీరయ్య. సోలోమన్ అనే డ్రగ్ మాఫియా లీడర్ ను పట్టుకోవడం కోసం సహాయం చేయమని ఇన్స్పెక్టర్ కోరడంతో వీరయ్య మలేషియా వెళ్తాడు. కట్ చేస్తే.. వీరయ్య మలేషియా వచ్చింది సోలోమన్ ను పట్టుకోవడానికి కాదని, అతడి అన్నయ్య మైఖేల్ కోసమని తెలుస్తుంది. అసలు మైఖేల్ కి, వీరయ్యకి ఉన్న వైరం ఏమిటి? ఈ మధ్యలో అసిస్టెంట్ కమిషనర్ విక్రమ్ సాగర్ పాత్ర ఏమిటి ?అనేది తెలుసుకోవాలంటే ‘వాల్తేరు వీరయ్య’ చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే.. చిరంజీవి మాస్ లుక్స్, మ్యానరిజమ్ మళ్లీ వాల్తేరు వీరయ్య పాత్రలోనే కనిపించాయి. ఇక చిరు అభిమానులు మిస్ అవుతున్న డ్యాన్సులు కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్రడక్షన్ & ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేసిన తీరు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమనిపిస్తోంది.
రవితేజ స్క్రీన్ ప్రెజన్స్ అండ్ ఎనర్జీ అదిరిపోయాయి. చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ మంచి కిక్ ఇచ్చాయి. శ్రుతి హాసన్ గ్లామర్ కోసమే కాకుండా.. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండడం కాస్త ఊరటనిచ్చింది. కేతరీన్ కూడా తన పాత్రమేరకు నటించింది. బాబీ సింహా విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ పాత్ర కాస్త పేలవంగా ఉంది.
డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ చాలా సింపుల్ రివెంజ్ స్టోరీని.. చక్కని స్క్రీన్ ప్లేతో అలరించే విధంగా తెరకెక్కించాడు. దీంతో మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. అలాగే చిరు కామెడీ టైమింగ్ ను వాడుకున్న తీరు బాగుంది. చిరంజీవి సినిమా నుంచి అభిమానులు ఏవేం కోరుకుంటారో.. సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రం వాల్తేరు వీరయ్య. చిరంజీవి కామెడీ టైమింగ్ అండ్ కామెడీ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి.