వీరసింహారెడ్డి విజయోత్సవం ముగిసింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య హంగామా షురూ అయింది. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దీంతో సినిమా సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్ లో ఫంక్షన్ ఏర్పాటుచేశారు. దీనికి వీరయ్య విజయ విహారం అనే పేరు పెట్టారు.
సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డికి పోటీగా రంగంలోకి దిగింది వాల్తేరు వీరయ్య సినిమా. అలా బాలయ్య కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చారు చిరంజీవి. అయినప్పటికీ బాలయ్య కంటే ముందే బ్రేక్ ఈవెన్ సాధించారు. అటు ఓవర్సీస్ లో వీరయ్య విజృంభనను మాటల్లో చెప్పలేం.
అలా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో కూడా హిట్టయింది వాల్తేరు వీరయ్య సినిమా. దీంతో ఓ విజయోత్సవ సభ ఏర్పాటుచేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని భావించారు చిరంజీవి. దానికి వరంగల్ ను వేదికగా ఎంచుకున్నారు. 28వ తేదీన ఈ ఫంక్షన్ ను చేయబోతున్నారు.
బాబి దర్శకత్వంలో తెరకెక్కింది వాల్తేరు వీరయ్య సినిమా. రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శృతిహాసన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.