ఈ సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాలపైనే ఎక్కువగా బజ్ ఉంది. పోటీ కూడా ఈ రెండు సినిమాల మధ్యే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి వస్తున్నాయి.
ఒకే బ్యానర్ నుంచి వస్తున్న చిత్రాలు కావడంతో, ఈ రెండు సినిమాల బిజినెస్ పై చాలా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి.
ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా విషయానికొద్దాం. ఈ మూవీని ఆంధ్రాలో 40 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇక సీడెడ్ లో రూ.14.50 కోట్లు, నైజాంలో 18 కోట్ల రూపాయలకు అమ్మకాలు సాగించారు.
ఇక.. వీరసింహారెడ్డి విషయానికొస్తే.. ఆంధ్రాలో ఈ సినిమాను 35 కోట్ల రూపాయలకు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, నైజాంలో 15 కోట్ల రూపాయలకు అమ్మారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్ని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. సొంతంగా రిలీజ్ చేస్తున్నప్పటికీ.. వాల్యూయేషన్ కట్టి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు.