‘టైటిల్’ వార్‌లో మెగా హీరోలు

మెగా యువహీరోలు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆ మధ్య నెలకో మెగా ఫామిలీ హీరో మూవీ రిలీజ్ ఉండేలా ప్లాన్స్ రెడీ అయ్యాయి. ఐతే, చెర్రీ-బన్నీ తమ సినిమాల కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నా.. వరుణ్- సాయిధరమ్ జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. లేటెస్ట్‌గా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్ కోసం ఇద్దరు మెగా హీరోల యూనిట్స్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందని ఫిల్మ్‌నగర్ టాక్.

అఫీషియల్‌గా ఈ టైటిల్‌ను క్రిష్ అనౌన్స్ చేసి అల్లు‌అర్జున్‌తో సినిమా ఉండబోతుందని ఇన్‌సైడ్ సమాచారం. ఇదే టైటిల్‌తో ఘాజీ డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి ప్లాన్ చేస్తున్న స్పేష్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌కు తొలుత ఇదే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. వరుణ్ ఇందులో ఆస్ట్రోనాట్ రోల్ చేస్తున్నాడని టాక్. ఇంతకీ ఈ టైటిల్ ఎవరికీ దక్కనుంది? లేదా సంకల్ప్‌రెడ్డితో క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.