బాహుబలి సమయంలో తెలుగు సినిమాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్, ఇప్పుడు అదే తెలుగు సినిమాపై కత్తి దూస్తున్నట్లు ఉంది. బాహుబలి తర్వాత తెలుగులో ఆ స్థాయిలో తెరకెక్కిన సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిజానికి ఆగస్ట్ 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు కానీ, తెలుగు సినిమాకి అండగా ఉంటుందనుకున్న బాలీవుడ్ మిషన్ మంగళ్, బట్ల హౌజ్ సినిమాలని కూడా అదే డేట్‌కి అనౌన్స్ చేశారు. రెండూ పెద్ద సినిమాలే కావడంతో థియేటర్ దొరకవనే సాహో సినిమా రెండు వరాలు వాయిదా పడి ఆగస్ట్ 30న విడుదలయ్యింది.
సాహో సినిమా ఏ సిట్యుయేషన్ ఫేస్ చేసిందో అదే పరిస్థితి ఇప్పుడు సైరా ఫేస్ చేస్తోంది. మెగాస్టార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సైరాని అంతకన్నా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్‌చరణ్ భావిస్తున్నాడు. అయితే అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కూడా అడ్డు నిలిచే ప్రయత్నం చేస్తోంది. హిందీలో సైరాను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్‌కి హృతిక్ అండ్ టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా కూడా అదే రోజున రిలీజ్‌కి రెడీ అవుతుండటం షాకిస్తోంది. టీజర్, ట్రైలర్‌తోనే ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్ సినిమాకి బాలీవుడ్‌లో థియేటర్స్ ఎక్కువగా దొరికే అవకాశం ఉంది కాబట్టి సైరా సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించవు. సో.. సైరా సినిమాని అక్టోబర్ 2నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహో అండ్ సైరా రెండూ ఇబ్బంది పడటానికి కారణం బాలీవుడ్.. వాళ్లు పొమ్మన కుండానే పోగపెడుతున్నారు. మరి వార్ దెబ్బకి సైరా వెనక్కి తగ్గుతాడా లేక తెలుగోడి సత్తా ఏంటో చాటి ఉత్తరానికి ఉయ్యాలవాడ గొప్పదనం వినిపిస్తాడా అనేది చూడాలి.