గుజరాత్‌లో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న సమయంలో ప్రధాని మోడీ ధరించిన శాలువాపై రచ్చ జరుగుతోంది. ప్రధాని మోడీపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను తాను ఫకీర్ అని చెప్పుకునే ప్రధాని మోడీ చాలా ఖరీదైన వస్త్రాలను కలిగి ఉన్నాడని అంటున్నారు.
రూ. 1,35, 000 విలువైన శాలువాను ధరించేంత స్తోమత వున్న ఫకీర్ ప్రధాని మోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని మోడీ పలు సందర్భాల్లో ధరించిన వస్త్రాలపై ఇప్పటికే పలుమార్లు విపక్షాలు ప్రధాని మోడీపై సెటైర్లు వేస్తూ వస్తున్నాయి.
ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రధాని మోడీ నిన్న గుజరాత్ కు వెళ్లారు. అక్కడ తన తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ సమయంలో ధరించిన శాలువాపై ఆయన్ని టార్గెట్ చేస్తు విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ పై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ బర్ బెర్రీ బ్రాండ్‌కు చెందిన రూ. 41 వేల 257 విలువ చేసే టీ షర్ట్ ధరించాడని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇంత ఖరీదైన దుస్తులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం తెలుస్తాయని బీజేపీ ప్రకటించంది.
ఇది ఇలా వుంటే టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కొందరు ఇల్లు కూడా గతి లేనోళ్లు రూ. 1.2 కోట్ల విలువ చేసే 10 ఫోన్లు పగలగొట్టుతున్నారని, బుర్జు ఖలీఫాలో ప్లాట్లు కొంటున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.