దిశ నిందితులపై ఎన్‌కౌంటర్ ద్వారా సత్వర న్యాయం జరిగిందని అంతా అభిప్రాయపడుతున్నారు. అంత కీచకంగా వ్యవహరించిన నిందితులకు బ్రతికే హక్కు లేదని మండిపడుతున్నారు.
అయితే… ఇలాంటి ఘటనే 2008 వరంగల్‌లో జరిగింది. కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న ప్రణీత, స్వప్నికలపై ముగ్గురు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో స్వప్నిక ప్రాణాలతో పోరాడి ఓడిపోగా… కాలిన గాయాలతో ప్రణీత భయపటడింది. దాంతో దిశ ఘటనలో ఎలాగైతే ఎన్‌కౌంటర్ జరిగిందో అలాగే అప్పుడు కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. నిందితులు అంతా మరణించారు.
అయితే… దిశ ఘటన తర్వాత ప్రణీత మాట్లాడుతూ… సత్వర న్యాయం అయితే జరిగింది. కానీ ఇంకా అలాంటి దాడులు, అఘాయిత్యాలు జరగటం లేదా…? న్యాయం జరగాల్సింది ఎన్‌కౌంటర్ ద్వారా కాదు, అలాంటి దాడులు జరగకుండా నిరోధించే చట్టాలు, వాటి అమలుతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె కఠిన చట్టాల కోసం డిమాండ్ చేశారు.