వేలకు వేలు ఫీజులు గుంజి… మళ్ళీ ఆసుపత్రి అంటే భయపడేలా చేసే ఆసుపత్రులు, డాక్టర్లున్న ఈ సమాజంలో ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లుంటారా…? మట్టిలో మాణిక్యంలో ఎక్కడో దగ్గర డబ్బు కోసం కాకుండా జనం కోసం బ్రతికే వారు ఉంటారు. అలాంటి డాక్టరే పాములపర్తి రామారావు.
వరంగల్ నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేసి, గత ఏడాది రైటయ్యారు డాక్టర్ రామారావు. ఖాళీగా ఉండి ఏం చేస్తాం… నలుగురికి సేవ చేస్తూ శేష జీవితం సంతృప్తిగా మల్చుకుందామనుకున్న తన ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చారు. వరంగల్‌లోని మట్టెవాడ ప్రాంతంలో తన ఇంటినే వైద్యశాలగా మార్చేసి, ఉచితంగా వైద్యం అందిస్తున్నారు రామారావు.
దీర్ఘకాలికంగా పీడించే వెన్ను నొప్పి సమస్యలు, కీళ్ల నొప్పులత ఓపాటు ఉదర వ్యాధులు, అలర్జీ, తలనొప్పి, దృష్టిలోపాలకు ఆయుర్వేద వైద్యం అందిస్తూ ఉచితంగా సేవ చేస్తున్నారు. రామారావు చేతివాటం బాగుండటంతో… పేద ప్రజలు రామారావునే నమ్ముకుంటున్నారు. అందుకే ఇప్పుడు రామారావు కాస్త పేదల డాక్టర్ అయిపోయారు.