పక్కనే ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా.. భయం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది ఓ మహిళా కార్పొరేటర్. హన్మకొండలో జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జరిగిందీ సంఘటన.
అది ఇస్తాం.. ఇది ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం.. ఏమీ ఇవ్వలేదని తెలిపింది 30వ డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల. డబుల్ బెడ్ రూం ఇళ్లు, పెన్షన్లు ఇలా అనేక పథకాలు అందడం లేదని గుర్తు చేసింది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోరింది.
కార్పొరేటర్ ప్రసంగిస్తున్న సమయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్టేజ్ పైనే కూర్చుని ఉన్నాడు. ఆయన సమక్షంలోనే కార్పొరేటర్ ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.