వరంగల్ లో రాజకీయం తారా స్థాయికి చేరుకుంది. వరంగల్ లో రాజకీయ నాయకుల దెబ్బకి ఐపిఎస్, ఐఏఎస్ లే కాదు నాన్ కేడర్ అధికారులు కూడా ఉద్యోగాలు చెయ్యలేకపోతున్నారు. అతి తక్కువ సమయంలోనే నలుగురు మున్సిపల్ కమిషనర్ లు మారారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో రాజకీయనాయకులకు బయపడి అధికారులు లాంగ్ లీవ్ లకు పరిమితం అవుతున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చటానికి వీలు లేదంటూ వత్తిళ్లు. జిల్లాలో ఏమి చెయ్యాలన్న ప్రజాప్రతినిధుల వత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రవికిరణ్ ను కూడా ఓ ప్రజా ప్రతినిధి ఘోరంగా అవమానించారని సమాచారం. చిన్న నేత దగ్గర నుంచి పెద్ద నేతల వరకూ అందరూ ఒత్తిళ్లు చేస్తున్నారని సమాచారం. నిధుల విషయంలో కూడా పెత్తనం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అంతే కాకుండా కీలక వ్యవహారాల్లో తమ ఇంటికి వచ్చి సంతకాలు పెట్టాలి అంటూ హుకూమ్ జారీ చేస్తున్నారట. ఇన్ని ఇబ్బందుల మధ్య ఉద్యోగం చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నరు. వరంగల్ లో ఉద్యోగం చెయ్యటం కంటే రాజీనామా చెయ్యటమే మేలు అని అనుకుంటున్నారట.