మహారాష్ట్రలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది గల్లంతు కాగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగిలినవారికోసం గాలింపు కొనసాగుతోంది. అమరావతి జిల్లా వార్ధానదిలో జరిగిందీ ఘటన.
కొద్దిరోజులుగా స్థానికంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువనుంచి వరదనీరు పోటెత్తడంతో వార్ధానది ఉప్పొంగింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నది మధ్యలోకి పడవ వెళ్లగానే బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు.