వార్నర్ క్రికెట్ గ్రౌండ్లోనే కాదు టిక్ టాక్ లతో సోషల్ మీడియాలో కూడా అదరగొడుతున్నాడు.. ఐపిఎల్ ఉండుంటే కనుక వార్నర్లో ఉన్న ఈ టాలెంట్ మనకు తెలిసేది కాదు.. అయినా మనోడి టైమింగ్ అసలు మామూలుగా ఉండదు.. మన టాలివుడ్ హీరోల బర్త్ డే లకు ఫర్ఫెక్ట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు..తాజాగా మహేశ్ బర్త్ డే సంధర్బంగా మైండ్ బ్లాక్ సాంగ్ కి స్టెప్పులేసి ప్రిన్స్ కి విషెస్ చెప్పాడు .. అబ్బబ్బా..ఇలాంటి విషెస్ నెవర్ బిఫోర్ ..ఎవర్ ఆఫ్టర్..
ఆగస్టు 9 న మహేశ్ పుట్టినరోజు వేడుకను అభిమానులు సందడిగా జరుపుకుంటే ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ మాత్రం తన సాంగ్ కి స్టెప్పులేసి మహేశ్ కి విషెస్ చెప్పాడు.. అందులో మహేశ్ ని లెజెండ్ అని సంభోదించడం..మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులదరగొట్టడం…మహేశ్ ఫ్యాన్స్ నే కాదు నెటిజన్లందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. వార్నర్ టిక్ టాక్స్ లో బాగా ఫేమస్ తన పిల్లలే.. ఈ పాటలో కూడా మనడో, తన వైఫ్ ముందు స్టెప్స్ వేస్తుంటే వెనుక ముగ్గురు పిల్లల సందడి నెటిజన్లను అబ్బురపరుస్తుంది.
ఐపిఎల్ లేక ఇoట్లోనే ఉంటున్న వార్నర్ ఎంచక్కా ఫ్యామిలితో టిక్ టాక్స్ ఛేస్తున్నాడు.. అందులోనూ తెలుగు పాటలు, డైలాగులకే.. మైండ్ బ్లాక్ సాంగ్ కి డ్యాన్స్ చేయండి సార్ అంటూ ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తే 50 అటెంప్ట్స్ తర్వాత ఫర్పెక్ట్ గా వచ్చిందంటూ మేలో ఒక వీడియో పెట్టాడు.. ఇప్పుడు అదే పాటకి మరోకసారి ఫర్పెక్ట్ గా స్టెప్పులేసాడు.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!
Also Check: మహేష్ పై నమ్రత ఎమోషనల్ ట్వీట్ – వైరల్