కరోనా వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత ఏప్రిల్‌లో జరగకపోవడంతో ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ప్లేయర్ డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ అభిమానులను ఆకర్షించే యత్నం చేశాడు. అందులో భాగంగానే టాలీవుడ్‌కు చెందిన పలు ఫేమస్ మూవీల పాటలకు వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో వార్నర్ హైదరాబాద్ అభిమానులకు చాలా దగ్గరయ్యాడు. అయితే అతను వారి అభిమానాన్ని మరిచిపోలేదు. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ అని చెప్పవచ్చు.
తాజాగా ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటకు డ్యాన్స్ చేశాడు. మైదానంలో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వెనుక వైపు గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాటను పాడగా అందుకు వార్నర్ స్టెప్పులు వేశాడు. ఆ పాటలో యాక్టర్లు వేసిన స్టెప్పుల మాదిరిగానే వార్నర్ స్టెప్పులు వేశాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వార్నర్ అలా చిన్నగా స్టెప్పులు వేశాడు. దీంతో ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Buttabomma and Warner Never Ending Love Story 😂😂♥️.#AUSvIND @davidwarner31 pic.twitter.com/TjEeMKzgt3
— M A N I (@Mani_Kumar15) November 27, 2020
అయితే నిజానికి వార్నర్ గత ఏప్రిల్ నుంచే ఇలా తెలుగు పాటలకు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక బుట్ట బొమ్మ పాట నిజంగానే సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చాలా మంది ఆ పాటను యూట్యూబ్‌లో పదే పదే చూస్తున్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటి పూజా హెగ్డె హీరోయిన్‌గా నటించగా, టబు, జయరాం వంటి వారు కీలకపాత్రలు పోషించారు. ఆ సినిమా ఈ ఏడాది జనవరి 12న విడుదల కాగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.