అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారి వారెన్ బఫెట్ తో లంచ్ చేసేందుకు ఓ వ్యక్తి భారీ మొత్తంలో బిడ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. బఫెట్ తో లంచ్ చేసేందుకు ఈ సారి ఓ వ్యక్తి ఏకంగా సుమారు రూ. 150 కోట్లకు బిడ్ చేశాడు.
ప్రతి ఏడాది తనతో ఒకసారి లంచ్ చేసేందుకు గాను వారెన్ బఫెట్ నిర్వహిస్తున్నారు. ఆ బిడ్ లో అధిక మొత్తంలో బిడ్ చేసిన వ్యక్తితో కలిసి వారెన్ బఫెట్ లంచ్ చేస్తారు. బిడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్లైడ్ ఫౌండేషన్ కు డొనేట్ చేస్తూ వస్తున్నారు.
గత 20 ఏండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అంతకు ముందు 2019లో నిర్వహించిన బిడ్ లో క్రిప్టో కరెన్సీ ఎంటర్ ప్రిన్యూర్ జస్టిన్ సన్ రూ. 31 కోట్లకు బిడ్ చేశారు. గత రికార్డును బద్దలు కొడుతూ ఈసారి ఏకంగా 150 కోట్లకు ఓ వ్యక్తి బిడ్ చేశాడు.
బిడ్ లో ఫైనల్ విజేతను ఎంపిక చేసేందుకు ఇంకా 10 గంటల సమయం ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ లోగా అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఎవరైనా బిడ్ చేస్తే వారిని విజేతగా ప్రకటిస్తామని తెలిపారు. చివరిసారిగా ఈ బిడ్ ను 2019లో నిర్వహించారు. ఆ తర్వాత కరోనా వల్ల రెండేండ్ల పాటు దీన్ని నిర్వహించలేదు.