తెలుగు సినిమా ప్రపంచంలో మర్చిపోలేని మహిళా పేర్లు కొన్ని ఉంటాయి. వాళ్ళ కోసం హీరోలు ఎంతటి వారైనా ఎదురు చూసేవారు. అలాంటి నటి భానుమతి అని చెప్పాలి. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా ఆమె ఎన్నో పాత్రల్లో చాలా బాగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ లాంటి నటుడు కూడా ఆమెను గౌరవించాల్సిందే కాళ్ళకు నమస్కారం చేయాల్సిందే అని బాలయ్యతో అన్నారంటే ఆమె స్థాయి చెప్పవచ్చు.
అలాంటి నటి జీవితం చివరి దశలో ఎన్నో కష్టాలు పడ్డారని అంటారు కాట్రగడ్డ మురారి. ఆయన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి వివరించారు. ఆమె నెత్తి మీద పెట్టుకొని పూజ పూజించాల్సిన ఒక దేవత అని కీర్తించిన ఆయన ఆవిడకు శాపం తగిలినట్టుగా చివరి రోజులు సరిగ్గా జరగలేదని ఆవేదన వ్యక్తం చేసారు. థైరాయిడ్ సమస్యతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బరువు కూడా భారీగా పెరిగిపోయారు.
ఇక తన కొడుకు, మనవళ్లు అమెరికాలోనే ఉండడంతో ఆమె ఇండియాలో ఒంటరిగా ఉండేవాళ్ళు. ఇల్లు చాలా పెద్దది, ఇంటి నిండా ఏసీలు ఉండేవి. అయినా సరే ఆమె మాత్రం కనీసం ఏసీ కూడా వేసుకోలేకపోయారని అన్నారు మురారి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన ఆమె… భర్త రామకృష్ణ ఉన్నప్పుడు చాలా సంతోషంగా గడిపారు. ఆయన మరణించిన తర్వాత ఆమె వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు.