వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి ఆయన నటనను పూర్తి స్థాయిలో బయటకు తీసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది చంటి. అప్పటి వరకు వెంకటేష్ అంటే సాదా సీదా నటుడు అనుకునే వాళ్లకు ఈ సినిమా సమాధానం చెప్పింది. పాత్రలో ఆయన లీనమైన విధానం బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాను దర్శకుడు తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది.
కథలో పట్టు ఉండటంతో ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఇప్పటికి మనం ఈ పాటలు వింటూనే ఉంటాం. ఇక మీనా నటన కూడా సినిమాలో బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ సినిమా తమిళ రీమేక్. తంబి అనే తమిళ సినిమా ఆధారంగా వచ్చింది ఈ సినిమా. అక్కడ కూడా ఈ కథ బాగా హిట్ అయింది.
ఈ సినిమా నిర్మాత కె ఎస్ రామారావు ముందు రాజేంద్ర ప్రసాద్ తో ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. కాని రామానాయుడు మాత్రం కథ బాగా నచ్చడంతో వెంకటేష్ కి బాగా సెట్ అవుతుంది అన్నారట. దీనితో వెంకటేష్ కి రాజేంద్ర ప్రసాద్ కి మధ్య గ్యాప్ వచ్చింది అంటారు. ఈ సినిమా దర్శకుడు రవి రాజా పినిశెట్టి కూడా రాజేంద్ర ప్రసాద్ అనే అనుకున్నారు. కాని రామానాయుడు ఓకే చేయడంతో వెంకటేష్ తో చేసారు.