మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మహేష్ నటన కంటే కూడా కథ ఎక్కువగా జనాలను ఆకట్టుకుంది. అప్పట్లో యువతకు చాలా బాగా దగ్గరైంది ఈ సినిమా. ముఖ్యంగా భూమిక కోసమే చాలా మంది ఈ సినిమాను చూసారు అప్పట్లో. ఇక దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఇక ఈ సినిమాకు అప్పుడు పని చేసిన వారిలో పరుచూరి బ్రదర్స్ కూడా ఉన్నారు.
ఈ ఇద్దరికీ అప్పుడు సినిమా పరిశ్రమలో తిరుగులేదు. దీనితో స్క్రీన్ ప్లే విషయంలో కూడా వాళ్ళు అనుకున్న విధంగానే ఉండాలని పట్టుబట్టారట. గుణశేఖర్ అనుకున్న దానికి సినిమా ప్లే అయిన దానికి చాలా తేడా ఉందని చెప్తారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయం లో కొన్ని సార్లు గుణశేఖర్ కి, పరుచూరి బ్రదర్స్ కు మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్తారు. కాని ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు.
దీనికి ముందుగా లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రాసుకున్నారట గుణశేఖర్. కాని అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదని భావించి లీనియర్ స్క్రీన్ ప్లే లోనే ఈ సినిమా రాసి షూట్ చేసారు. అప్పుడు అనేక రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. కర్నూలు పేరు అప్పుడు మార్మోగింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇమేజ్ కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి.