సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాకు ఈ సినిమాకు మధ్య పెద్ద పోటీ నడిచింది. ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒకరకంగా యుద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య నటనకు విమర్శకుల ప్రసంశలు వచ్చాయి. ప్రధానంగా ఇంటర్వెల్ సన్నివేశంలో ఆయన నటన ఒక రేంజ్ లో ఉందనే కామెంట్స్ వచ్చాయి.
ఫ్యాక్షన్ నేపధ్యంతో వచ్చిన ఈ సినిమా రాయలసీమ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఒక టీడీపీ నేత స్పూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించా అన్నారు దర్శకుడు మలినేని గోపిచంద్. పరిటాల రవి గురించి నాకు తెలిసిన విషయాలతో పాటు నేను చదివిన విషయాలను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమా తీశానని అన్నారు. పోలీసులు పరిటాల రవి జీపును తనిఖీ చేస్తుండగా ఆయన ఏమీ పట్టించుకోకుండా స్టైల్ గా సిగరెట్ తాగారని పేర్కొన్నారు.
ఆ సన్నివేశాన్ని స్పూర్తిగా తీసుకుని వీరసింహారెడ్డి ఇంటర్వెల్ సీన్ లో బాలయ్య చుట్ట తాగుతూ చనిపోయేలా ప్లాన్ చేశానని వివరించారు గోపీచంద్ మలినేని. పరిటాల రవి మీద ఎటాక్ జరగడం కంటే ముందు ఆయనను అమెరికాకు ఆహ్వానించారని కాని ఆయన వెళ్లలేదని తెలిపారు. పరిటాల రవి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలా ఆయన పాత్రను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు.