అటు తమిళంలో అయినా ఇటు తెలుగులో అయినా సరే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు సిద్దార్థ్. ఈ తరం వాళ్లకు అతను బాగానే దగ్గరయ్యాడు గాని చేసిన సినిమాలు హిట్ కాకపోవడం, కెరీర్ మీద సరైన ఫోకస్ లేకపోవడంతో ఎప్పుడో ఒక సినిమా చేస్తున్నాడు. వచ్చిన అవకాశాలను పెద్దగా అందిపుచ్చుకోలేక కెరీర్ ప్రమాదంలో పడేసుకున్నాడు.
అతని కెరీర్ లో మరుపురాని సినిమా బాయ్స్… అసలు ఆ సినిమాకు ఎలా ఎంపిక చేసారో చూద్దాం. బాయ్స్ సినిమా కంటే ముందే సిద్దార్థ్ సినిమాల్లోకి వచ్చాడు. యాడ్ ఫిలిం మేకర్ జితేంద్ర దగ్గర, సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర సిద్దార్థ్ కొన్ని రోజులు పని చేసాడు. వీళ్ళు సహాయం చేయడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గరికి వెళ్తే… అదే టైం లో కెరీర్ మలుపు తిరిగే అడుగు పడింది.
మణిరత్నం కన్నతుల్ ముతమిట్టల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్ ఒక చిన్న పాత్రలో కనపడతాడు. మాధవన్ బస్సులో వెళ్లే ఒక సీన్లో అతడి వెనక ఉంటాడు సిద్దార్థ. ఈ సినిమాకు పని చేసిన సుజాత… శంకర్ కి రికమెండ్ చేయడంతో బాయ్స్ సినిమాకు సెలెక్ట్ చేసారు. ఇక ఆ తర్వాత మణిరత్నం కూడా సిద్దార్థ్ టాలెంట్ ని గుర్తించడంతో కెరీర్ ముందుకు వెళ్తున్నాడు.