పెళ్లి వేడుకలు అంటే ముందుగా యువతి యువకులు ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లపై ఆసక్తి చూపిస్తారు. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
తాజాగా.. ఇటీవల ఫోటో షూట్ కు వెళ్లిన ఓ ప్రేమ జంట ప్రమాదంలో చిక్కింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కొహెడలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ఇద్దరి పరిస్థితి విషయంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబసభ్యులు.
అయితే.. రెండు రోజుల్లో పెళ్లి ఉండగా కొత్త జంట ప్రమాదంలో ఇరుక్కోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.