మన్‌కీబాత్‌లో భాగంగా ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌పై ప్రశంసలు కురిపించారు. కుళ్లిపోయిన, చెడిపోయిన కూరగాయలు, వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించుకున్న విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్ కూరగాయల వ్యాపారుల నిర్ణయం.. కొత్త ఆవిష్కరణ అంటూ అభినందించారు. వారి ఆలోచనతో చెత్త కూడా సంపదగా మారుతోందని చెప్పారు. చెత్తను బంగారంగా మార్చడమంటే ఇదేనన్నారు.
బోయిన్‌పల్లి మార్కెట్‌లో రోజూ 10 టన్నుల వరకు కూరగాయల వ్యర్థాలు మిగిలిపోతాయన్న ప్రధాని.. వాటి నుంచి ప్రతిరోజూ 30 కిలోల బయో ఫ్యూయల్, అలాగే 500 యూనిట్ల విద్యుత్ అవుతుందని మోదీ చెప్పుకొచ్చారు.