దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహలతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దులో మనకు రక్షణగా ఉన్న సైనికులకు మాత్రం తమ కుటుంబాలతో హోలీ వేడుకలు జరుపుకోవడం కుదరదు.
కాబట్టి..వారు ఏ పండుగ వచ్చిన సమీప గ్రామస్తులతో కలిసి సెలెబ్రెట్ చేసుకుంటారు.తాజాగా జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా, సాంబా సెక్టార్లలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్‌లు హోలీ పండుగ జరుపుకున్నారు.
సాంబా సెక్టార్‌లో సమీప గ్రామస్తులతో కలిసి జవాన్‌లు హోలీని ఎంజాయ్ చేశారు. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో మహిళా జవాన్‌లు దలేర్ మహెందీ పాటలకు స్టెప్పులు వేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.