పెళి వేడుకలో కొరియన్ వ్యక్తి యే జవానీ హై దీవానీ మూవీలోని కబీరా సాంగ్‌ను ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీయూషా పాటిల్ అనే మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ క్లిప్‌లో కొరియన్ కిమ్ జయోన్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపై కూర్చుని కబీరా పాటను ఆలపించడం కనిపిస్తుంది. వేదికపై గిటార్‌తో మరో వ్యక్తి కిమ్‌కు సహరించడం చూడొచ్చు. హిందీ తెలియకపోయినా కిమ్ ఎంతో శ్రావ్యంగా పాట పాడటం అతిధులను ఆకట్టుకుంటుంది.
పెళ్లికి వచ్చిన అతిధులంతా చప్పట్లతో కిమ్‌ను ఎంకరేజ్ చేయడం క్లిప్‌లో కనిపిస్తుంది.సోదరి సంగీత్‌లో లవ్‌లీ పెర్ఫామెన్స్ ఇది..అతడి యాసను ఎవరూ ఎద్దేవా చేయవద్దు.
కిమ్ జయోన్‌కు హిందీ సహా భారతీయ భాషలేవీ తెలియకపోయినా బాలీవుడ్ పాటలంటే ఎంతో ఇష్టం..వధూవరులకు అభినందనగా ఈ పాట పాడాడని..అతడిని అభినందించి ప్రేమను వ్యాపింపచేద్దామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.