రెండు ఏటీఎం మెషిన్‌లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు దొంగలు. ఈ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ ఆరెయిన్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లగా ఈ ఏటీఎం మెషిన్‌లో రూ.8 లక్షలు, రూపన్‌గఢ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్‌లో రూ.30 లక్షలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు ఆ రెండు ఏటీఎం కేంద్రాల్లో చొరబడి ఏటీఎం మెషిన్‌లను పెకిలించిన తీరు వాటిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
రెండు ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు ఒకేలా జరగడంతో అది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH Thieves uprooted ATM machine & looted cash yesterday in Ajmer, Rajasthan
ATM machines looted in Arain & Roopangarh. Rs. 8 Lakhs & Rs. 30 Lakhs were stolen. Robbery method in both cases identical so it could be same gang: Vaibhav Sharma, Additional SP, Rural pic.twitter.com/CszNQ28A91
— ANI (@ANI) January 27, 2023