హేమమాలిని…అందానికి అసలు పేరు.నటనకు మారు పేరు. ఏళ్ళు గడిచాయి గానీ ఇప్పటికీ ఆ అందం చెక్కు చెదరలేదు. సినిమారంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. మథుర ఎంపీగా ఎన్నికై ప్రజాసేవలో నిమఘ్నమయ్యారు హేమ.
బృందావన్‌లోని రాధా రమణ్ ఆలయంలో హేమామాలని వేదికపైకి వెళ్లి హరే కృష్ణ, హరే కృష్ణ అంటూ భజన గీతం చెబుతుండగా…ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు వంతపాడారు. ఈ ఉదయం రాధా రమణ్ ఆలయానికి వెళ్లిన హేమామాలిని ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆలయంలో భజన గీతాలపన జరుగుతుండగా అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత తనూ వేదికపైకి వెళ్లి ఒక పాట పాడారు. హేమామాలిని పాడిన పాటను కింది వీడియోలో మీరూ ఒకసారి వినండి.