అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ జలాశయంలో సందడి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో.. సాగర్ జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. ఈక్రమంలో నీటి కుక్కలు కొట్టుకువచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోని వాటర్ స్కెల్ సమీపంలో సంచరిస్తూ కంటబడ్డాయి.
నీటి కుక్కలు ఉభయచరజీవులైనప్పటికీ.. నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని, ఎక్కువగా నీళ్లలోనే జీవిస్తాయి. చాలా తక్కువ సమయాల్లోనే బయటకు వస్తాయి. నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. స్థానికులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. గతంలో 2017లో ఒకసారి శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిపించాయి.