యురేనియం సమస్యపై మరో గొంతుక కలిసింది. బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు తాను స్వయంగా కడపలో పర్యటిస్తానని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందరి మద్దతు కూడగడతామని ఆయన ఒక వీడియోలో తెలిపారు. బాధితులను మద్దతుగా నిలుస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్‌తో తాను సమావేశమై దీనిపై చర్చించానని అన్నారు.
హైదరాబాద్: కడప యురేనియం బాధితులకు అందరూ అండగా నిలవాలని ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన సామాజికవేత్త రాజేంద్రసింగ్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్‌కు రాజేంద్ర సింగ్ జవాబిచ్చారు. సేవ్ నల్లమల ఉద్యమంలో భాగస్వాములు కావాలని అభిలషించారు. సమస్యకు పరిష్కారం కనుగొనడంలో అందరూ ముందుకు రావాలని, కలిసి కదలాలని కోరారు. అంతకుముందు రోజు కడప యురేనియం బాధితులకు మద్దతుగా నిలుస్తామంటూ రాజేంద్ర సింగ్ మాట్లాడిన వీడియోను జనసేన అధినేత ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.