విశాఖపట్నం శివారులోని వెంకటాపురంలో ఉన్నఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి లీకైన విష వాయువు అదుపులోకి వచ్చింది. ఉదయం నుండి శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. అయితే… లీకైన చోటు నుండి చుట్టూ మూడు కి.మీ పరిధిలో వాటర్ స్ప్రే చేసే పనిని అధికారులు ముమ్మరం చేశారు.
వాటర్ స్ప్రే కారణంగా గాలిలో ఉన్న విష వాయువు తగ్గే అవకాశం ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది వాటర్ స్ప్రేను ముమ్మరం చేశారు.
ఇక ఈ ఘటనలో ఇంట్లోనే ఎవరైనా ఉండిపోయారా అని ఇంటింటికి వెళ్లి అధికారులు ఆరా తీస్తున్నారు. సృహ తప్పి ఎవరైనా పడిపోయారేమో అన్న అనుమానంతో చెకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.